AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ వేద ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.