బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీ(Dance show Dhee)లో కొరియోగ్రాఫర్ (Choreographer)గా ఉన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య(Dance Master Chaitanya) సూసైడ్ చేసుకున్నాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్ లో చైతన్య సూసైడ్(Suicide) చేసుకున్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చైతన్య వీడియోలో తెలిపాడు.
కొరియోగ్రాఫర్ చైతన్య పోస్టు చేసిన సెల్ఫీ వీడియో:
ఆత్మహత్యకు ముందు కొరియోగ్రాఫర్ చైతన్య (Choreographer Chaitanya ) సెల్ఫీ వీడియో(Selfie Video) రికార్డు చేశాడు. తాను ఆ పనిచేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్సర్లకు క్షమాపణలు తెలిపాడు. అప్పులవాళ్ల నుంచి వస్తోన్న ప్రెజర్ ను తాను తట్టుకోలేకపోతున్నానని, చాలా ట్రై చేసినా తన వల్ల కావడం లేదని వీడియోలో చైతన్య(Dance Master Chaitanya) చెబుతూ కంటతడి పెట్టుకున్నాడు.
ఒక అప్పును పూడ్చుకునేందుకు మరో తప్పు చేయాల్సి వచ్చిందని, అలా తప్పులు చేస్తూ పోతే చాలా అప్పులు పెరిగిపోయాయని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఢీ షో ద్వారా చాలా మందికి నేమ్, ఫేమ్ వచ్చిందని, ఢీ షోకు రుణపడి ఉంటానని తెలిపాడు. జబర్దస్త్ షోలో వచ్చే డబ్బులు ఢీ షోలకు రావడం లేదని తెలిపాడు. ప్రస్తుతం చైతన్య(Dance Master Chaitanya) పోస్టు చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.