»Health Tips Amazing Health Benefits With Leftover Chapatis At Night
Health Tips : రాత్రి మిగిలిన చపాతీలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
చాలా మంది రాత్రి పూట చపాతీలు(Chapatis), రోటీ(Roties)లను తింటూ ఉంటారు. అయితే అందులో కొంత మంది రాత్రి మిగిలిపోయిన చపాతీలు, రోటీలను బయటపడేస్తుంటారు. రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం పూట తింటే డయాబెటిస్(Diabeties) సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నేటి రోజుల్లో కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నవారు ఎక్కువ. కొందరు మాత్రం సరైన ఆహార పదార్థాల(Food Items)ను తీసుకుంటూ ఆరోగ్య నియమాలు(Health Rules) పాటిస్తుంటారు. అందులో చాలా మంది రాత్రి పూట చపాతీలు(Chapatis), రోటీ(Roties)లను తింటూ ఉంటారు. అయితే అందులో కొంత మంది రాత్రి మిగిలిపోయిన చపాతీలు, రోటీలను బయటపడేస్తుంటారు. లేకుంటే పెంపుడు జంతువులకు పెడుతూ ఉంటారు. రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం పూట తింటే డయాబెటిస్(Diabeties) సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్(Diabeties). షుగర్ పేషెంట్లు రాత్రి పూట మిగిలిన చపాతీ(Chapatis)లను ఉదయం పూట తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. రాత్రి పూట చపాతీలు, రోటీ(Roties)లల్లో స్టార్చ్ నిరోధకత అనేది పెరుగుతుంది. అది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్(Breakfast)లో పాలు, కూరలతో కలిపి రాత్రి పూట మిగిలిన చపాతీలు, రోటీలు తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
నిల్వ ఉండే రోటీలు(Roties) రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. హై బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా ఈ వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పూట మిగిలిన చపాతీ(Chapatis)లను ఉదయం పాలలో 15 నిమిషాల పాటు నానబెట్టి తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) కలుగుతాయి. నిల్వ ఉన్న చపాతీలు, రోటీలు ఉదర సమస్యలు రాకుండా చూస్తాయి. జీర్ణ సమస్యల(Digestive problems) బారి నుంచి కాపాడుతాయి.
రాత్రి నిద్రపోయే ముందు మిగిలిపోయిన చపాతీల(Chapatis)ను పాలలో నానబెట్టాలి. వాటిని ఉదయం పూట తింటే మలబద్ధకం, ఎసిడిటీ(ACDT), గ్యాస్ట్రిక్ వంటి జీర్ణ సమస్యలు దూరం అవ్వడమే కాకుండా శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఉష్ణోగ్రత అనేది అదుపులో ఉంటుంది. పాలు, రోటీల(Rotis) కాంబినేషన్ తో పోషకాలు పుష్కలంగా అందుతాయి. హైపర్ టెన్షన్ ఉన్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్‌గా రాత్రి మిగిలిన రోటీలు, చపాతీ(Chapatis)లు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.