సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వాహన సేవలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 15 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.