NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాలలో FLS, FLN కార్యక్రమాల నిర్వహణను పరిశీలించిన ఆయన, విద్యార్థుల గణిత, ఆంగ్ల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభకు ముగ్ధులై వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కిరణ్ పాల్గొన్నారు.