VSP: చిన్నయ్యపాలెం హైవేపై ఇవాళ గుర్తుతెలియని వ్యాను, ఆటోను ఢీకొట్టడంతో కె.కోటపాడు మండలం సంతపాలెం గ్రామానికి చెందిన నంబారు ఈశ్వరమ్మ తీవ్ర గాయాలపాలైయ్యారు. రైతుబజార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయాన్నే కురుస్తున్న దట్టమైన పొగమంచుకు వాహనాలు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.