TG: రాష్ట్రంలో యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు వ్యవసాయ శాఖ యాప్‌లో కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం జిల్లా యూనిట్‌గా ఉన్న పంపిణీని, CM రేవంత్ ఆదేశాల మేరకు మండల లేదా నియోజకవర్గ స్థాయికి మార్చనున్నారు. దీనివల్ల రద్దీ తగ్గి, రైతులకు స్థానికంగానే ఎరువులు అందుతాయి. ప్రైవేటు డీలర్లపైనా నిఘా పెంచుతూ, పంపిణీని పారదర్శకం చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.