TG: HYDలోని బేగంపేట వాతావరణ శాఖ(IMD) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్ ఆవరణలో 14 RDX బాంబులను అమర్చినట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తక్షణమే అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఐఎండీ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది.