JN: బచ్చన్నపేట మండల కేంద్ర పరిధిలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో గల కిచెన్‌ను సందర్శించి కూరగాయలు తాజాగా ఉన్నాయా లేదా అని, అలాగే వంట సరుకుల నాణ్యత, గుడ్లను నీటిలో వేసి వాటి నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. మెను ప్రకారం భోజనం అందించాలన్నారు.