BPT: అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి పనులపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మంత్రి వినతిపత్రం అందజేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.