NDL: గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలో ఇవాళ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. గ్రామ వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి ఆహ్వానం మేరకు గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గ్రామ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.