»Now The New Law To Curb Piracy Centers Key Announcement
Cine Industry : ఇకపై పైరసీ కట్టడికి కొత్త చట్టం.. కేంద్రం కీలక ప్రకటన
సినీ ఇండస్ట్రీలో పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)ని పైరసీ(Piracy) భూతం వదలడం లేదు. అనేక చర్యలు తీసుకున్నప్పటికీ అధికారులు పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. స్టార్ హీరోలు(Star Heros) సైతం పైరసీ భూతాన్ని అరికట్టడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. టాలీవుడ్(Tollywood) హీరో మహేష్ బాబు(MaheshBabu) సైతం పైరసీపై పోరాటం చేశారు. ‘అర్జున్’ మూవీ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ వద్ద మహేష్ బాబు నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఓటీటీ(OTT)ల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా పైరసీ ద్వారా వేరే వెబ్ సైట్స్ లో దర్శనమిస్తున్నాయి. పలు పాపులర్ షోలకు కూడా ఈ పైరసీ భూతం అంటుకుంది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్(Hero Prabhash) అన్‌స్టాపబుల్ షోలో కనిపించారు. ఆ ఎపిసోడ్ రిలీజ్ కు ముందే అనేక వెబ్ సైట్స్‌లో ప్రత్యక్షమైంది. దీంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎపిసోడ్‌కు ‘ఆహా’ నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సినీ రంగంలోని సమస్యల గురించి చిరంజీవి(Chiranjeevi) వంటివారు ప్రతి కార్యక్రమంలోనూ చర్చిస్తూ ఉంటారు. కేంద్రానికి కూడా అనేక సార్లు ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry) సమస్యలను వివరించారు.
ఈ సమస్యపై కేంద్రం స్పందించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా పరిశ్రమలో పైరసీ(Piracy)ని కట్టడి చేసేందుకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని(Cinematograph Act) తీసుకొస్తున్నట్లు నరేంద్ర మోదీ(Narendra Modi) సర్కార్ ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లును రాబోవు పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ, ఉత్తరాది సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేశాయి.