W.G: కన్నతల్లిని అతికిరాతకంగా హతమార్చిన కుమారుడికి భీమవరం మూడో అదనపు కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పాలకోడేరుకు చెందిన నమ్మి రవి గత ఏడాది మే నెలలో తన తల్లి రాజ్యలక్ష్మిపై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. పోలీసులు సేకరించిన పక్కా ఆధారాలతో, నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం తీర్పు వెలువరించింది.