జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా చురకలు అంటించారు. పవన్ పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని రోజా ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితిలో , అయోమయంలో ఉన్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ప్రజాబలం లేదని బిజేపి నేతలు నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. అందుకే మొన్న విశాఖ టూర్ లో పవన్ ను పక్కన పెట్టాడని ఎద్దేవా చేశారు. అందుకే సొంతగా రావాల్సింది పోయి పొత్తులకోసం ఎదురుచూస్తున్నాడని అన్నారు.
ఇక ఇటీవల జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.. అయితే కిరణ్ రాయల్ పై నేను కంప్లైంట్ చేయలేదని… నేను అతనితో ఫోన్ లో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
రోజాపై మాట్లాడితే ఫేమస్ అవ్వొచ్చని , పబ్లిసిటి వస్తుందని , మీడియా ప్రయారిటీ ఇస్తుందని ఇలాంటి వారంతా నాపై నోరుపారేసుకుంటున్నారని అన్నారు. కిరణ్ అనే వ్యక్తి రాయల్ అని తన పేరు పక్కన వ్యాపారం కోసమే చేర్చుకున్నాడు. జనసేనకు , అతని వల్ల నష్టం తప్ప లాభం లేదని అన్నారు.