TG: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి గాంధీ భవన్‌కు చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నేతలు వారికి ఘనస్వాగతం పలికారు. టీపీసీసీ చీఫ్ పర్యవేక్షణలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియపై నేతలు చర్చిస్తున్నారు.