AKP: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 6,557 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,096 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.