AP: రాష్ట్రంలో నమోదవుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీల పట్ల సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు గర్భం దాల్చడం ఆందోళన కలిగించే విషయమన్న ఆయన.. ప్రస్తుతం టీనేజీ ప్రెగ్నెన్సీలు 8.8 శాతంగా ఉన్నాయని తెలిపారు. ఈ రేటును కనీసం 3 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.