JN: జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల గ్రామానికి చెందిన మాచర్ల మౌనిక ఒకే కాన్పులో ఆదివారం ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత సంతానం కలగడంతో సిజేరియన్ ద్వారా ప్రసవం నిర్వహించగా ముగ్గురు మగశిశువులు జన్మించారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, శిశువులు క్షేమంగా ఉన్నారు అని వైద్యులు తెలిపారు.