నెల్లూరు: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జన గణన కార్యక్రమం దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్రక్రియని, ప్రతి ఒక్క వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించడం అవసరమని రాపూరు తహసీల్దార్ పీ. లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు. గురువారం జనగణనపై సమీక్షించారు. జన గణన చేపట్టే ముందు మొదటగా హౌస్ లిస్టింగ్, హౌసింగ్ కార్యకలాపాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు.