అన్ని మ్యాచులను ఒకే మైదానం(దుబాయ్)లో ఆడటమే CT-2025లో భారత్కు కలిసొచ్చిందంటూ.. ఆ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నజిర్ హుసేన్, మైఖేల్ అథర్టన్ గతంలో తక్కువ చేసి మాట్లాడారు. దీనిపై తాజాగా దినేష్ కార్తీక్.. T20 WCలో లంక స్వదేశంలో, పాక్ దాదాపు అన్ని మ్యాచులూ కొలంబోలో ఆడిందని, మరి ఈ 2 జట్లు ఎందుకు సరైన ప్రదర్శన చేయలేకపోయాయని వారిని నిలదీశాడు.