ప్రపంచంలోనే అతి సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ(BCCI)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. బీసీసీఐ పురుష క్రికెటర్ల(BCCI Mens Cricketers)తో సమానంగా మహిళా క్రికెటర్ల(Womens Cricketers)కు కూడా పారితోషికాలు ఇస్తూ వస్తోంది. తాజాగా ప్రైజ్ మనీ(Prize Money) విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రైజ్ మనీని పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
రంజీ ట్రోఫీ(Ranji Trophy) విజేతకు రూ.5 కోట్ల ప్రైజ్ మనీ(Prize Money)ని ఇవ్వనున్నట్లు బీసీసీఐ(BCCI) కార్యదర్శి జైషా తెలిపారు. రంజీల్లో ఇప్పటి వరకూ విజేతకు రూ.2 కోట్ల బహుమతి మాత్రమే ఇచ్చేవారు. దానిని ఇప్పుడు రూ.5 కోట్లకు చేర్చింది. రంజీ ఫైనల్ లో ఓడిన టీమ్ కు రూ.3 కోట్లు, సెమీస్లో ఓడిన జట్టుకు రూ.1 కోటీ ఇవ్వనున్నారు.
ఇకపోతే సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ(Womens ODI Trophy) విజేతలకు రూ.50 లక్షలు, రన్నరప్ కు రూ.25 లక్షలను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ విజేతలకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలను ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దేశవాళీ టోర్నీల్లో ప్రైజ్ మనీ(Prize Money) పెంచడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.