TG: ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా HYDలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గట్లేదు. గత 14 నెలల్లో ఫైన్ ద్వారా రూ.14 కోట్లు వసూలయ్యాయి. ఇక జరిమానాలతో పని కాదని గుర్తించిన పోలీసులు.. డ్రంకెన్ డ్రైవ్ చేసినవారి వివరాలను వారు పనిచేసే కంపెనీలకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో జరిమానాతో పాటు ఉద్యోగానికీ ఎసరొస్తుందని, నగరవాసులు మారతారని భావిస్తున్నారు.