అన్నమయ్య: పీలేరు పట్టణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసినట్లు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.