RTC : ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్ సర్కారు గుడ్ న్యూస్
ఆర్టీసీ ఉద్యోగులకు (RTC employees) శుభవార్త ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ (PRC) ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ (Bajireddy Govardhan) తెలిపారు.ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు
తెలంగాణ (Telangana) ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ (PRC) అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) అన్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపం(RTC Kalyana Mandapam) లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాజిరెడ్డి గోవర్థన్ పాల్గోన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని బాజిరెడ్డి తెలిపారు. సీఎంకేసీఆర్ (CM KCR) సానుకూలంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల (RTC employees) భద్రత విషయంలో సంస్థ అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు(Reservations) అమలు కాకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంస్థ జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్, చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి.రవీందర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.కృష్ణ, గడ్డం శ్రీనివాస్, ఈడీ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.