TPT: నాయుడుపేట చంద్రబాబు కాలనీ సమీపంలోని ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. శిశువు ఏడుపు విని గమనించిన స్థానికులు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. సీడీపీవో ఉమామహేశ్వరి పసికందును ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం శిశువును తిరుపతిలోని చైల్డ్ హోంకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.