KNR: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ అవగాహన ప్రచార వాహనాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రారంభించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ భాగంగా ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు జరుగుతుందన్నారు. వివిధ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.