TPT: నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, యువతకు ఉపాధి కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. డిసెంబర్ 2025 నుంచి సింగిల్ డెస్క్ విధానంలో 2440 దరఖాస్తుల్లో 2323కు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 16 పరిశ్రమలకు రూ.4.52 కోట్ల ప్రోత్సాహకాలు ఆమోదించారు. APIIC ద్వారా కేటాయించిన భూములపై పరిశ్రమలు త్వరగా ప్రారంభించాలన్నారు.