అసెంబ్లీ ఆవరణలో మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విగ్రహ ఏర్పాటుకు కాంక్రీటు పనులను మొదలు పెట్టారు. బేస్ మెంట్ పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వరుసలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.