నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా ఆయన ఘనత సాధించారు. బాలకృష్ణ ఇటీవలే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆయన ‘అఖండ-2’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, త్వరలో క్రిష్ దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ సీక్వెల్లో నటించబోతున్నారు.