HYD: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.