ఆదిపురుష్ టీజర్ దెబ్బకు సీన్ రివర్స్ అయిపోయింది.. దాంతో ఇప్పుడు అనుకున్నదే జరిగింది.. ఆదిపురుష్‌ను అఫిషీయల్‌గా వాయిదా వేశారు మేకర్స్. అది కూడా చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ మరింత డిసప్పాయింట్ అవుతున్నారు.
ఆదిపురుష్ టీజర్లో గ్రాఫిక్స్ పై నెగెటివ్ టాక్ రావడంతో.. వీఎక్స్పై మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకుంది చిత్ర యూనిట్. దాంతో తాజాగా డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ పోస్ట్‌పోన్‌తో పాటు కొత్త డేట్‌ను కూడా ప్రకటించాడు. ‘ఆదిపురుష్ కేవలం సినిమా మాత్రమే కాదు.. శ్రీరాముడు, మన సంస్కృతి, చరిత్ర పట్ల మా కమిట్మెంట్ తెలియజేసే విధంగా ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఇంకొంత సమయం కావాలి..
అందుకే జూన్ 16, 2023న ఆదిపురుష్‌ని రిలీజ్ చేయబోతున్నామని.. తప్పకుండా ఈ చిత్రాన్ని దేశం గర్వపడే విధంగా తీర్చిదిద్దుతామని.. ఓం రౌత్ తెలిపాడు. ప్రభాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. దాంతో ఆదిపురుష్ చిత్రం దాదాపు 7, 8 నెలలు వాయిదా పడిందని చెప్పొచ్చు. అంతేకాదు టీజర్ రెస్పాన్స్‌తో ఆదిపురుష్ టీం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా వీక్‌గా ఉన్న సీన్స్‌పై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రియాల్టీగా ఉండేలా రీషూట్ కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకోసం మళ్ళీ భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఏదేమైనా ఆదిపురుష్ పోస్ట్ పోన్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశకు గురవుతున్నారు.