NGKL: మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు బుధవారం కొల్లాపూర్‌కు రానున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రవచన కార్యక్రమం ఉంటుందని ఆర్యవైశ్య సంఘం నేత సుదర్శన్ శెట్టి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.