AP: తూ.గో జిల్లా దేచర్లలో బుల్లెట్ల కలకలం రేగింది. UP నుంచి వచ్చి ఉంటున్న సమీర్ హుస్సేన్ నుంచి పోలీసులు 9mm పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్ కోసం ఉపయోగించే 8mm బుల్లెట్లు ఆరింటిని స్వాధీనం చేసుకున్నారు. UP వెళ్లివస్తుండగా పరిచయమైన ఆదిత్యరాజ్ ఇవి ఇచ్చాడని, అతని వద్ద గన్, బుల్లెట్లు ఉన్నాయని సమీర్ పేర్కొన్నాడు. ఆదిత్యపై ఇప్పటికే రాజమండ్రి PSలో పలు కేసులు ఉన్నాయి.