NRML: కడెం మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన నాగిళ్ళ లక్ష్మీ కుటుంబం ఆపన్నాహస్తం కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల లక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు ఆపరేషన్ అవసరమని, అందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వారిది నిరుపేద కుటుంబమని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నారు.