పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో తనకెంతో ఇష్టమైన మ్యాచ్ గురించి టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాక్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 2007 ఫైనల్ పోరు నాకు అత్యంత ఇష్టమైన మ్యాచ్. ఆ అనుభూతిని మరేదీ మించలేదు’ అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, ఆ విజయం ద్వారానే భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.