ASF: ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ గురువారం పలు వార్డుల్లో పర్యటించి ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించారు. బకాయిల వసూళ్లపై సిబ్బందితో సమీక్ష నిర్వహించి, లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి పన్నులే కీలకమని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నులు చెల్లించాలని కోరారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవన్నారు.