AKP: హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం అసెంబ్లీలో అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పడంతో తోటి మంత్రులు ఎమ్మెల్యేలు మార్షల్స్ సభ బయటకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్సకు సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.