ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటెండరుగా విధులు నిర్వహిస్తున్న వల్లభాపురం నాగ ఆంజనేయులు గురువారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నాగ ఆంజనేయులు మృతి పట్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.