జీ 5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’ వెబ్‌సిరీస్ రికార్డులు సృష్టిస్తోంది. రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో కృష్ణ పోలూరు తెరకెక్కించిన ఈ థ్రిల్లర్, కేవలం 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉత్కంఠభరిత కథనంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.