తమిళ హీరో అజిత్ ప్రధాన పాత్రలో మాగిజ్ తిరుమేని తెరకెక్కించిన మూవీ ‘విడాముయార్చి’. తాజాగా ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 6:40 గంటలకు తమిళంతో పాటు తెలుగులో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.