»Jairam Ramesh Tweet Goes To Viral On Fcra Fine Rs 3 19 Cr To Ttd
TTDకి భారీ షాక్.. జైరామ్ రమేశ్ Tweetతో వెలుగులోకి
హుండీలో వేసే భక్తుల ముడుపులపై కూడా పన్నులు పెనాల్టీలను కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని మండిపడుతున్నారు. విదేశీ కానుకలు విషయంలో 3 కోట్ల జరిమానా చెల్లించాలని చెప్పడం దారుణంగా పేర్కొంటున్నారు. ఇదేనా కోట్లాదిమంది మెజారిటీ ప్రజల మనోభావాలు పరిరక్షించే పద్ధతి అని నిలదీస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) (Tirumala Tirupati Devasthanam -TTD) కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తీసుకున్న అనుమతి గడువు ముగిసినా రెన్యూవల్ చేసుకోకపోవడంపై కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు జరిమానా (Fine) విధించింది. అనుమతి లేకపోవడంతో టీటీడీ వద్ద విదేశీ కరెన్సీ (Foreign Currency) ఐదేళ్లుగా మూలుగుతోంది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ఎంపీ జై రామ్ రమేశ్ (Jairam Ramesh) ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్రం వేసిన జరిమానాను తాము చెల్లించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తెలిపారు.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ సీఆర్ఏ) (Foreign Contribution Regulation) Act) కింద హుండీలో వచ్చే విదేశీ కరెన్సీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి (లైసెన్స్) తీసుకున్నది. ఈ అనుమతి ద్వారా భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మన కరెన్సీలోకి మార్చుకుంటుంది. 2018లో ఈ అనుమతి కాల పరిమితి ముగిసింది. దీంతో అప్పటి నుంచి రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ టీటీడీ వద్ద మూలుగుతోంది.
కాగా లైసెన్స్ (License) గడువు ముగిసినా కూడా టీటీడీ (TTD) విదేశీ కరెన్సీ సేకరించడంపై ఎఫ్ సీఆర్ఏ (FRCA) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 2019లో రూ.1.14 కోట్లు టీటీడీకి జరిమానా (Penalty) విధించింది. ఆలస్యంగా గుర్తించిన టీటీడీ అందించిన ఆదాయ వివరాలు సక్రమమై ఫార్మాట్ (Format)లో పంపకపోవడంతో కేంద్రం తాజాగా రూ.3.19 కోట్లు జరిమానా వేసింది. దీంతో మొత్తం జరిమానా రూ.4.33 కోట్లకు చేరింది. ఈ వ్యవహారం కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ జరిమానాను తాము చెల్లించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపాడు. కాగా కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హుండీలో వేసే భక్తుల ముడుపులపై కూడా పన్నులు పెనాల్టీలను కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని మండిపడుతున్నారు. విదేశీ కానుకలు విషయంలో 3 కోట్ల జరిమానా చెల్లించాలని చెప్పడం దారుణంగా పేర్కొంటున్నారు. ఇదేనా కోట్లాదిమంది మెజారిటీ ప్రజల మనోభావాలు పరిరక్షించే పద్ధతి అని నిలదీస్తున్నారు.
सबसे पवित्र तिरुमाला तिरुपति देवस्थानम (TTD) जहां हर दिन लाखों भारतीय तीर्थयात्री जाते हैं, उसे मोदी सरकार नोटिस भेजती है और 3 करोड़ रुपए का जुर्माना लगाती है, जबकि अडानी को बचा लिया जाता है।