మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ.. మెగాభిమానులను చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే ముందుగా ఈ సినిమాలో చరణ్ జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే చేశాడని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా చిరు-చరణ్ స్క్రీన్ స్పేస్ కాస్త ఎక్కువగానే ఉంది. దాంతో ఆచార్య సినిమాను మెగా మల్టీస్టారర్ మూవీనే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చరణ్ పాత్రకు కాస్త వెయిటేజ్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మెగా 154(mega 154)లో కూడా రవితేజది అలాంటి రోల్ అనే తెలుస్తోంది.
వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజాది చిన్న అతిథి పాత్ర మాత్రమే అని అనుకున్నారు. కానీ రవితేజ ఈ సినిమాలో చాలాసేపే కనిపించనున్నారట. ఆచార్యలో చరణ్ కనిపించనంత సేపు.. మెగా 154లో రవితేజ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా మెగా 154 రన్ టైమ్‌లో రవితేజ 35 శాతం తెరపై సందడి చేయనున్నారట. అంటే.. అటు ఇటుగా 40 నిమిషాలు మెగాస్టార్‌తో మాస్ రాజా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని చెప్పొచ్చు.
ఇదే నిజమైతే.. ఇటు మెగా, అటు మాస్ రాజా ఫ్యాన్స్ దెబ్బకు థియేటర్ షేక్ అయిపోవడం ఖాయమని చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే టీజర్ వచ్చే వరకు ఆగాల్సి ఉంది. ఈ నెల 24న ఉదయం 11:07 గంటలకు.. మెగా 154 టైటిల్ టీజర్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.