విండీస్‌పై అజేయంగా 97* పరుగులతో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. T20 WCలో 2వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ రోహిత్(92) పేరిట ఉండగా.. తర్వాతి స్థానంలో కోహ్లీ(89*) ఉన్నాడు. ఈ లిస్ట్ అగ్రస్థానంలో ఉన్న రైనా(2010లో 101 vs SA).. T20 WC సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కొనసాగుతున్నాడు.