ATP: పెద్దవడుగూరు మండల పరిధిలోని కాసేపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి దాదాపు రూ. 42,600లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి నట్లు పేర్కొన్నారు.