HNK: మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను DGP శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వాహనాల నిర్వహణలో సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.