సమాజంలో సామాన్యులకే కాక సెలబ్రిటీలకు(celebrities )భద్రత కరువవుతోంది. వేధింపులు, బ్లాక్ మెయిల్( Black meyil )కేసులు విపరితంగా పెరుగుతున్నాయి. రీసెంట్ గా ఏకంగా డిప్యూటీ సీఎం (Deputy CM) భార్యనే బెదిరించారు. డిప్యూటీ సీఎం భార్యను ఒక డిజైనర్ బెదిరించింది. ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. డిప్యూటీ సీఎం భార్య వీడియోలు (social media) వైరల్ చేస్తానంటూ డిజైనర్ బెదిరింపులకు పాల్పడింది. ఈమధ్య కాలంలో కేటుగాళ్లు.. ఎంతలా బరి తెగిస్తున్నారంటే.. సామాన్యులనే కాక సినీ, రాజకీయ సెలబ్రిటీలను కూడా బురిడి కొట్టిస్తున్నారు. మరి కొందరు ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చిండి. మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం భార్య అమృత ఫడ్నవీస్(Amrita Fadnavis) ఇలా బెదిరింపులు ఎదుర్కొన్నారు.
ఆమెకు వ్యక్తిగత డిజైనర్‌గా(designer) పని చేసే అనిక్ష జైసింఘానీ అనే మహిళ.. ఇలా బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు రూ. 10 కోట్లు ఇవ్వాలని.. లేదంటే అమృతకు చెందిన వీడియోలను వైరల చేస్తానని డిజైనర్ అనిక్ష జైసింఘానీ (Aniksha Jaisinghani) బెదిరింపులకు పాల్పడ్డట్లు అమృత పోలీసులకు తెలిపింది. దాంతో అనిక్ష జైసింఘానీ మీద పోలీసులు బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కొన్ని రోజుల క్రితమే పోలీసులు (police)అనిక్ష మీద ఓ కేసు నమోదు చేశారు. అది కూడా అమృత ఫడ్నవీస్ (Fadnavis) ఇచ్చిన ఫిర్యాదు మేరకే. రంగంలోకి దిగిన పోలీసులు బ్లాక్ మెయిల్, బెదిరింపుల కేసు నమోదు చేసి అనిక్షను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న వీడియోలను పరిశీలించగా.. అవి మార్ఫింగ్ వీడియోలుగా తేలింది. దీంతో ఆ వీడియోలను క్రియేట్ చేసిన నిందితులకోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డిజైనర్ అనిక్ష తండ్రి అనిల్ జైసింఘానీ పేరుమోసిన అంతర్జాతీయ క్రికెట్ బుకీ అని తెలిసింది. ఆయనపై పలు కేసులు ఉన్నాయి.