ASR: రక్త హీనతతో బాధపడుతున్న, హై రిస్క్ గర్భిణులను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, వైద్యం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. హై రిస్క్ గర్భిణులను గుర్తించి రిజిస్ట్రేషన్ పోర్టల్లో నమోదు చేయించాలన్నారు. అధికారులు ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు.