ATP: తిరుపతిలోని (ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో ఈనెల 4న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.