TG: ములుగు జిల్లాను టెంపుల్ టూరిజం ప్రాంతంగా చేయాలని భావిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. వరంగల్లోని హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. మంత్రి సీతక్క కోరిక మేరకు దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతమైన బాసర నుండి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.