AP: నకిలీ డీప్‌ఫేక్ వీడియోతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. ‘వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. TTD ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. YCPకి చెందిన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలపై చట్టపరంగా ముందుకెళ్తా. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని తెలిపారు.